నెటిజన్ పై నిప్పులు చెరిగిన సమంత

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine samantha
Updated:  2018-10-12 02:54:26

నెటిజన్ పై నిప్పులు చెరిగిన సమంత

సమంత ఇండస్ట్రీకు వచ్చినప్పటి నుండి చాలా వరకు ఆమె సినిమాల్లో డబ్బింగ్ చెప్పింది చిన్మయి నే కావడంతో వారిద్దరి కి మంచి స్నేహం ఉంది. ఇక సౌత్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న మీ టూ ఉద్యమంలో చిన్మయి చేస్తున్న వ్యాఖ్యలను తాను పూర్తిగా నమ్ముతానని తనని సపోర్ట్ చేస్తాను అని సమంత చెప్పుకొచ్చింది.

ఈ నేపథ్యంలో ఒక ఫ్యాన్ ఈమెను ఎప్పుడో జరిగినదాన్ని ఇప్పుడు బయటపెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించగా, అదే మా భయం కూడా. తప్పంతా మాదే అని మీరెక్కడ అంటారో అన్న భయంతోనే సమయం కుదిరినప్పుడల్లా మా సమస్యలను భయటపెడుతున్నాం అని సమాధానమిచ్చింది. ఇక మరొకడ ఈరోజు మా అబ్బాయి నన్ను ఓ ప్రశ్న అడిగాడు. డాడీ అసలు మీటూ అంటే ఏంటి అని అడిగాడు. దానికి నేను మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్ భీమా పధకం అని చెప్పాను. అప్పుడు మా బాబు అంటే ఏంటి అని అడిగాడు. ‘ఆడవాళ్లు అన్ని విషయాల్లో తలదూరుస్తారు.ఇక కెరీర్‌ ముగిశాక ఈ భీమాను వాడుకుంటారు.

అప్పుడు వాళ్ల గురించి విలేకరులు వార్తలు రాస్తుంటారు అని నేను చెప్పా. ఇది విని మా అబ్బాయి గాడ్‌ బ్లెస్‌ ఇండియా అని అన్నాడు అంటూ చెత్త కామెంట్ పెట్టగా, ఫైర్ అయిన సమంత మరి అదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెప్తావ్..? అని ప్రశ్నిస్తూ దిమ్మదిరిగే జవాబిచ్చింది. ఇక ఆ నెటిజన్ తోక ముడిచేశాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.