మీ టూ లో చేరిన త్రిష చెల్లెలు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine trisha
Updated:  2018-10-22 01:59:38

మీ టూ లో చేరిన త్రిష చెల్లెలు

మీ టూ ఉద్యమంలో చేరుతున్న హీరోయిన్ ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మీ టూ అంటూ తన అనుభవాన్ని మనతో పంచుకుంది సంజన గల్రాని. ఈమె తెలుగులో పలు సినిమాల్లో ఇప్పటికే కనిపించింది. ఈమె పేరు గుర్తుపట్టకపోయినా, ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లిగా నటించిన అమ్మాయే సంజనా గల్రాని. 

మీటూలో భాగంగా సంజనా కూడా తన చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది సంజన. ఆమె మొదటి సినిమా కన్నడలో వచ్చిన గండా హెండతి. అప్పుడు ఆమె వయసు 15 మాత్రమే. ఇంకా 11వ తరగతి చదువుతోంది. బాలీవుడ్ లో మల్లికా శెరావత్ బోల్డ్ గా నటించిన మర్డర్ కు రీమేక్ ఇది. కథ చెప్పినప్పుడు మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేస్తానని కేవలం ఒకే ఒక్క కిస్ సీన్ ఉంటుందని చెప్పిన దర్శకుడు రవి శ్రీవాత్సవ షూటింగ్ మొదలయ్యాక ప్లేట్ ఫిరాయించాడు.

బాలీవుడ్ లో లాగానే మసాలా కంటెంట్ బాగా దట్టించాడు. బోలెడు ముద్దు సీన్లతో పాటు బోల్డ్ సీన్స్ కూడా షూట్ చేయించాడట. తల్లి నుంచి అభ్యంతరం వస్తుందేమో అనుకుని ఆవిడ లేని సమయంలో చేసి పూర్తి చేసేవాడట. తన మాట వినకపోతే కెరీర్ నాశనం అవుతుందని చెప్పి బెదిరించి ఆ సినిమాను పూర్తి చేసాడు అని సంజన వాపోయింది. తనకు మాత్రమే ఇలా జరిగి ఉంటుంది అనుకుంటున్న సంజనా ఇప్పుడు మీ టూలో అంత కన్నా దారుణమైన కథలు వినటంతో తన సంగతి బయట పెట్టిందట.

షేర్ :

Comments

0 Comment