మళ్ళి తన హవా కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-07 18:53:02

మళ్ళి తన హవా కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా కి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది, కాని గత కొంత కాలంగా ఈ బ్యూటీ కి సరైన అవకాశాలు లేవు. ఈ భామ నటించిన గత చిత్రం అయిన "బాహుబలి 2" లో కూడా తమన్నా కి పెద్ద రోల్ ఏమి లేదు. అలాగే ఇటివలే రిలీజ్ అయిన "నా నువ్వే" సినిమా వల్ల తమన్నా కి పెద్దగా ఒరిగింది ఏమి లేదు.

కాని ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది ఈ భామ. ఇప్పటికే హిందీ మూవీ అయిన "క్వీన్" తెలుగు రీమేక్ లో మెయిన్ లీడ్ గా నటిస్తుంది తమన్నా. ఈ మూవీతో పాటు మెగా స్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న "సై రా నరసింహారెడ్డి" లో కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తుంది తమన్నా.

ఈ మూవీ లో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు వెంకటేష్ ఇంకా వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న "ఎఫ్ 2" సినిమాలో కూడా వెంకటేష్ పక్కన హీరోయిన్ గా చేస్తుంది తమన్నా. ఇన్ని ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న తమన్నా ఏ ఒక్క సినిమాతో అయిన భారీ హిట్ ని తన ఖాతా లో వేసుకుంటుంది అనే ధీమా తో ఉంది.

షేర్ :