అత‌నితో ల‌వ్ బ్రేక‌ప్ అయ్యా తాప్సీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-14 02:27:18

అత‌నితో ల‌వ్ బ్రేక‌ప్ అయ్యా తాప్సీ

ఝుమ్మందినాదం  సినిమాలో హీరోయిన్ న‌టించి, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు, తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయ‌మైయ్యారు తాప్సీ... ఈ సినిమా హిట్ తో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ కొంత కాలం పాటూ తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొన‌సాగారు తాప్సీ...అయితే  ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా త‌మిళ భాష చిత్రాల్లోను ఈ సొట్ట‌బుగ్గ‌ల చిన్న‌ది న‌టిస్తోంది...
 
తాజాగా  వాలెంటైన్స్ డే రోజునాడు త‌న ప్రేమ వ్య‌వ‌హారంపై స్పందించారు తాప్సీ... తాను రెండో త‌ర‌గ‌తిలోనే ప్రేమ‌లో ప‌డ్డాన‌ని, కాని అది ప్రేమ అని త‌న‌కు తెలియద‌ని అన్నారు.. ఆ అబ్బాయి చాలా క్యూట్ గా ఉండేవాడ‌ని తెలిపారు తాప్సీ... తాను హైస్కూల్ కు వెళ్లిన త‌ర్వాత  కేవ‌లం ఆ అబ్బాయిని చూడాల‌నే ఆశ‌తో చ‌క్క‌గా రెడి అయి వెళ్లెదానిన‌ని చెప్పారు తాప్సీ... గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఇప్పుడు త‌లుచుకుంటే చ‌లా అస‌హ్యంగా ఉంద‌ని అన్నారు...తాను ఫిలిం ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాకా అవ‌న్ని మ‌రిచి పోయాన‌ని చెప్పింది.
 
అయితే తాను గ‌త నాలుగు సంవ‌త్సరాల క్రితం ఒక యువ‌కుడి ప్రేమ‌లో ప‌డ్డాన‌ని,  కొద్ది కాలం త‌ర్వాత ఒక‌రికొక‌రు ప్ర‌పోజ్ లు చేసుకున్నాకా  ఇద్ద‌రు హ్యాపీగా ఉన్నామ‌ని చెప్పింది... మ‌ధ్య‌లో ఏదో ఒక విష‌యంలో బ్రేక‌ప్ అయ్యామ‌ని తెలిపారు తాప్సీ... తాను అత‌నితో బ్రేక‌ప్ చేసుకోవ‌డ‌మే మంచిద‌ని పించింద‌ని, ఆ త‌ర్వాత త‌న కెరియ‌ర్ ప‌రంగా తాను ఎంతో అభివృద్ది చెందాన‌ని చెప్పారు తాప్సీ... కాగా తాను ల‌వ్ విష‌యంలో విజ‌యం సాధించ‌లేక‌పోయినా కెరీర్ లో విజ‌యాన్ని సాధించాన‌ని అన్నారు తీప్సీ..
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.