ప్రొడ్యూసర్ల కి రూల్స్ పెడుతున్న త్రిష

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

trisha
Updated:  2018-10-27 05:14:00

ప్రొడ్యూసర్ల కి రూల్స్ పెడుతున్న త్రిష

అభినయం అయినా, అందాల ఆరబోత అయిన ఒకప్పుడు కుర్ర హీరోల దగ్గర నుండి అగ్ర హీరోల వరకు జోడి కట్టిన స్టార్ హీరోయిన్ త్రిష. ఈ మధ్య కుర్ర హీరోలకు జోడి గా సరిపోట్లేదు కానీ, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో వస్తుంది త్రిష.

మొన్న ఆ మధ్య మోహిని అనే డబ్బింగ్ చిత్రం ప్లాప్ అయిన, ఈ మధ్య కాలంలో 96 అనే చిత్రం లో చేసిన పాత్రకి మంచి పేరు వచ్చింది.చిత్రం కూడా మంచి టాక్ తో, కలెక్షన్ రాబడుతుంది. అయితే ఇక త్రిష దగ్గరకి డేట్స్ కోసం వెళ్లే ప్రొడ్యూసర్లకు, 2 రూల్స్ పెడుతుంది అంట త్రిష. మొదటిది రెమ్యూనరేషన్ 2కోట్లు, రెండవది గ్లామర్ రోల్స్ అగ్ర హీరోల సరసన చెయ్యను అని. అగ్ర హీరోలకి అనగా ఏజెడ్ హీరో ల పక్కన నటించడానికి హీరోయిన్స్ కొరత ఉండడం తో ఇలాంటి రూల్స్ తో కాష్ చేసుకుంటుంది అంట త్రిష.

ఇది వరకు కింగ్, నమో వేంకటేశ, లయన్ లాంటి సినిమాల్లో ఈ అమ్మడు పెద్ద హీరో ల పక్కన గ్లామర్ రోల్స్ చేసి అందాల ప్రదర్శన చేసిన సంగతీ తెల్సిందే.ఈ మధ్య కాలం లో ఒక ప్రొడ్యూసర్ త్రిష డేట్స్ కోసం వెళ్లి సంప్రదించడంట. అప్పుడు ఈ అమ్మడు ఈ రూల్స్ కోసం చెప్పిందంట, ఇంకా అవాక్ అయ్యి వెనుతిరిగి వచ్చేసాదంట ఆ ప్రొడ్యూసర్.

షేర్ :