జయలలిత బయోపిక్ లో త్రిష ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jayalalitha and trisha
Updated:  2018-07-30 03:48:58

జయలలిత బయోపిక్ లో త్రిష ?

స్టార్ హీరోయిన్ అయిన త్రిష కి గత కొన్నేళ్ళుగా అటు తెలుగు లో ఇటు తమిళ్ లో సరైన అవకాశాలు లేక చతికిలబడిపోయింది. త్రిష ఇటివలే నటించిన హారర్ సినిమా అయిన "మోహిని" కూడా భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ గా నిలవడమే కాకుండా త్రిష కి ఉన్న కాస్త ఇమేజ్ ని కూడా నాశనం చేసింది.
 
ఇక కెరీర్ లో ఎలాంటి సినిమాలు ఎన్నుకోవాలో తెలియని త్రిష ఒక బయోపిక్ కి సైన్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఆ బయోపిక్ మరెవరిదో కాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలితా ది. తమిళ్ ఇంకా తెలుగు లో ఈమె మీద బయోపిక్ ప్లాన్ చేస్తున్నారు కొందరు నిర్మాతలు.
 
అయితే ఆ రోల్ కి మొదట కీర్తి సురేష్ ని అనుకున్నా గాని ఆ తరువాత మళ్ళి త్రిషకే ఓటు వేసారు అంట నిర్మాతలు. అలాగే త్రిషకి కూడా జయలలిత అంటే చాలా ఇష్టం అంట. పైగా తానూ చిన్నప్పటినుంచి జయలలిత ఫ్యాన్ అని ఆమె మరణం తమిళ్ నాడుకి తీరని లోటు అని చెప్పుకొచ్చింది త్రిష

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.