హీరోయిన్ ఒక్క సెల్ఫి వీడియో కి అంత ఇస్తున్నారా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroines
Updated:  2018-11-03 04:37:58

హీరోయిన్ ఒక్క సెల్ఫి వీడియో కి అంత ఇస్తున్నారా..?

సోషల్ మీడియా లో ఫేస్ బుక్, వాట్స్యాప్ తో పాటు వీ చాట్, షేర్ చాట్ కూడా మంచి ఫేమస్ యాప్స్ ఏ. ఇప్పుడు ఈ యాప్స్ ని హీరోయిన్స్ తో ప్రోమోట్ చేయిస్తున్నారు ఆ యాప్ యజమానులు. మొత్తానికి తమ యాప్స్‌ను ప్రమోట్ చేసే బాధ్యత హీరోయిన్లపై పెట్టాయి ఈ సంస్థలు. రాశీ ఖన్నా హలో అంటోంది తన గురించి, తన సినిమాల గురించి తెలుసుకోవడానికి హలో యాప్ డౌన్‌లోడ్ చేసుకోమ‌ని, అందులో త‌న‌ను ఫాలో అవ్వ‌మ‌ని అంటోంది.

హీరోయిన్లు మెహరీన్, శ్రియ, రష్మిక మందన్న, మాళవికా శర్మ, మన్నారా చోప్రా, రష్మీ.. హీరోలు సందీప్ కిషన్, నవదీప్, నందు కమెడియన్లు ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి, రాహుల్ రామకృష్ణ, జబర్దస్త్ బ్యాచ్ ‘హలో యాప్’ను ప్రమోట్ చేస్తున్నారు. సమంత ఏమో షేర్ చాట్ డౌన్‌లోడ్ చేసుకోమ‌ని, అందులో తనను ఫాలో అవ్వమని అంటోంది. తను షేర్ చాట్‌లో తెలుగులో మాట్లాడతానని ఒక వీడియో విడుదల చేసింది.

తమన్నా, శృతి హాసన్, పూజా హెగ్డే, అనుపమా పరమేశ్వరన్ తదితరులు షేర్ చాట్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ ఒక్క వీడియో కోసం హీరోయిన్స్ బాగానే వసూలు చేస్తున్నారు అంట. దాదాపు పది నుంచి ఇరవై లక్షల వరకు ఒక్కో హీరోయిన్ వసూలు చేస్తున్నటు తెలుస్తుంది. కేవలం కొన్ని సెకండ్స్ కోసం లక్షలు తీసుకోవడం కేవలం హీరోయిన్స్ కి మాత్రం చెల్లుతుంది. 

షేర్ :

Comments

0 Comment