అల్లు అర్జున్ సినిమాకి అంత అవసరమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

allu arjun
Updated:  2018-08-21 04:58:13

అల్లు అర్జున్ సినిమాకి అంత అవసరమా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం విక్రం కే కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గీత ఆర్ట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల చివరి వారంలో మొదలు కాబోతుంది అనే టాక్ ఉంది. అయితే ఈ సినిమా కోసం విక్రం కే కుమార్ నిర్మాతలని 45 కోట్ల భారి బడ్జెట్ ని అడిగినట్టు తెలుస్తుంది.

అసలు విక్రం కే కుమార్ ఇప్పటి వరకు ఆ రేంజ్ బడ్జెట్ లో సినిమా ఎప్పుడు తీయలేదు. అయితే ఇపుడు అల్లు అర్జున్ కోసం రెడీ చేసుకున్న స్క్రిప్ట్ హై టెక్నికల్ వాల్యూస్ తో ఉన్నదీ కాబట్టి ఈ రేంజ్ లో బడ్జెట్ అడుగుతున్నాడు. ఇది కేవలం సినిమా బడ్జెట్ మాత్రమే అంట. నటీనటుల రెమ్యునరేషన్ ఇంకా అవన్నీ కలుపులుంటే సినిమా బడ్జెట్ ఈజీగా 50-60 కోట్లు దాటుతుంది.

అసలు అల్లు అర్జున్ కి ఆ రేంజ్ లో బడ్జెట్ కేటాయించి మళ్ళి వసూళ్లు రాబట్టడం అనేది చాలా కష్టం అని కొంత మంది టాక్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "బద్రీనాథ్" అనే సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచినా విషయం అందరికి తెలిసిందే. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.