విజువ‌ల్ వండ‌ర్ రోబో 2.0 ట్రైల‌ర్ హైలెట్స్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

robo 2
Updated:  2018-11-05 03:20:15

విజువ‌ల్ వండ‌ర్ రోబో 2.0 ట్రైల‌ర్ హైలెట్స్‌

దక్షినాది ఫిలిం ఇండస్ట్రీ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.o సినిమా ట్రైలర్ వేడుక నిన్న చెన్నైలో అత్యంత ఘనంగా జరిగింది. కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు ఎందరో పాల్గొన్న ఈ ఫంక్షన్ లోరాజమౌళి, రాజ్ కుమార్ హిరానీ కూడా పాల్గొన్నారు.. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రజినీకాంత్ ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకున్నారు.  ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
 
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.o సినిమాపై రోజు రోజుకీ భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ మద్య రిలీజ్ అయిన టీజర్ 2.o పై అంచనాలు పెంచితే..తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ బీభత్సం సృష్టిస్తుంది. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రజినీకాంత్ ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకున్నారు. 2.o సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా ఎన్నో కారణాల వల్ల పెండింగ్ పడుతూ వచ్చింది. ఈ మద్య సినిమా రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు మొదలు పెట్టడంతో 2.o పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. రజనీకాంత్ అభిమానులతో పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న 2.ఓ సినిమా ట్రయిలర్ వచ్చేసింది. ఈ ఫంక్షన్ లో రజినీకాంత్ మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు.
 
దక్షినాది సినిమా రంగానికి సంబంధించి శంకర్ తో పాటు అంత ఘనమైన కీర్తి కలిగిన ఒకే వ్యక్తి రాజమౌళి అంటూ రోబో 2.o సినిమా గురించి చెపుతూ మధ్యలో రాజమౌళి ప్రస్తావన తీసుకు వచ్చాడు రజినీకాంత్. అంతేకాదు 2.o సూపర్ హిట్ అంటూ ఈమాట నేను చెపుతున్నాను వ్రాసుకోండి అంటూ మీడియా వర్గాలకు సవాల్ విసిరాడు రజినీకాంత్.అంతేకాదు ఈసినిమా రజనీకాంత్‌ను ప్రతిభను పరీక్షించడానికో, అక్షయ్ కుమార్ టాలెంట్ పరీక్షించడానికో తీయలేదు అని అంటూ ఇది ఇండియన్ ఫిలి