మరోసారి హిందువుల ఆగ్రహానికి గురి అయిన మోడల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sofia hayat model
Updated:  2018-10-31 04:02:27

మరోసారి హిందువుల ఆగ్రహానికి గురి అయిన మోడల్

నటులు, మోడల్స్ ఎప్పుడు మీడియా దృష్టి తమ వైపు ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఎదో రకంగా ఫేమస్ అవ్వడం ఈ మధ్య కాలంలో రొటీన్ గా తయారయింది. వివాదాస్పద నటి, మోడల్ అయిన సోఫియా హయత్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు, హిందువులు. ఈ భామను ఇంత ద్వేషించడానికి  కారణం ఈ భామ చేసిన వివాదాస్పద చేష్టలు.
 
హిందువులు చాలా పవిత్రం గా భావించి, పూజించే స్వస్తిక్ ని తన పాదాల కింద వేసుకోవడం. పాదాల కింద స్వస్తిక్ గుర్తు వేసుకొని హిందువుల మనోభావాలను కించపరచడమే కాకుండా, దాన్నీ  ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత దారుణం. దాంతో  ఆగ్రహించిన హిందువులు బూతులు తిట్టేస్తున్నారు సోఫియా హయత్ ని .ఇలాంటి వివాదాలు ఈ భామ కి కొత్తేమి కాదు .ఇంతకుముందు కూడా హిందువుల దేవుళ్ళ ని అవమానిస్తూ రకరకాలుగా పోస్ట్ లు పెట్టింది.
 
దేవుళ్ళ బొమ్మలను తన శరీరం పై వేరే భాగాల్లో వేయించుకుంది. అప్పుడు కూడా ఇలాగె సోఫియా మీద విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడేమో ఏకంగా స్వస్తిక్ గుర్తు ని కాలి కింద వేసుకోవడంతో తీవ్ర ఆగ్రహం గా ఉన్నారు. వెంటనే ఆ గుర్తు అక్కడి నుండి తీసి వేసి, క్షమాపణ చెప్పాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు . అయితే ఎవరు ఎన్ని బూతులు తిట్టిన ఈ భామ మాత్రం చూడను కూడా చూడట్లేదు. 

షేర్ :