హైప‌ర్ ఆది ల‌వ్ ప్ర‌పోజ‌ల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-15 03:09:57

హైప‌ర్ ఆది ల‌వ్ ప్ర‌పోజ‌ల్

ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ ల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా ప‌రిచ‌య‌మ‌య్యారు హైప‌ర్ ఆది...  ఈ షోలో త‌న డ్ర‌స్సింగ్ స్టైల్ తో, పంచ్  డైలాగ్ ల‌తో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తుంటారు ఆది...బుల్లితెరలో హాస్య న‌టుడిగా అడుగు పెట్టిన ఆది, ప‌లు టీవీ కార్య క్ర‌మాల్లో న‌టిస్తూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు.. అయితే  ప్ర‌స్తుతం ఆది బుల్లి తెర కార్య క్ర‌మాల్లోనే కాకుండా, వెండితెరలో కూడా ప‌లు చిత్రాల‌లో హాస్య న‌టుడిగా న‌టిస్తూ త‌న దైన శైలిలో డైలాగ్స్ వేస్తున్నారు..
 
ఇటీవ‌లే హైప‌ర్ ఆది త‌న ప్రేయ‌సికి వాలెంటైన్  డే రోజు నాడు, ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది... హైప‌ర్ త‌న‌  ప్ర‌పోజ్ లు కూడా భార‌త దేశంలో కాకుండా,  ఫారెన్ కంట్రీలో ప్ర‌పోజ్ చేశార‌ని... సోష‌ల్ మీడియాలో ఈ వార్త వైర‌ల్ అవుతోంది... త‌న ప్రియురాలి చేయి ప‌ట్టుకుని ఓ కాల‌నీ న‌డి రోడ్డులో అందరు చూస్తుండ‌గానే ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.
 
కానీ ఈ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ ఏ మాత్రం నిజం కాద‌ట‌... తాజాగా హైప‌ర్ ఆది రీసెంట్ గా హాస్య న‌టుడిగా న‌టించిన చిత్రం తొలిప్రేమ... ఈ  సినిమాలో వ‌రుణ్ తేజ్ హీరోగా, రాశీఖ‌న్నా స‌ర‌స‌న చేశారు...  ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో అక్క‌డున్న ఓ అమ్మాయితో క‌లిసి ల‌వ‌ర్ బాయ్ లాగా ఫోజులిస్తూ త‌న‌తో ఫోటోను తీయించుకున్నార‌ట ఆది... ఈ ఫోటోను ప్రేమికుల రోజు సందర్భంగా ఆది త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో వాలెంటైన్స్ డే  స్ప్రెడ్‌ లవ్‌ అంటూ పోస్టు చేశారు.. దీంతో ఫాలోవర్స్‌ అందరూ పంచ్‌లతో పాటు ప్రేమించడం, ప్రపోజ్‌ చేయడం కూడా వ‌చ్చిందంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజ‌న్లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.