నేను ఆ హీరోతో గొడ‌వ‌ప‌డ‌లేదు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-03 11:11:16

నేను ఆ హీరోతో గొడ‌వ‌ప‌డ‌లేదు

సాయి పల్లవి ఇంకా హీరో శర్వానంద్ ఇటివలే "పడి పడి లేచే మనసు" సెట్ లో గొడవ పడింది అనే న్యూస్ బయటకి వచ్చింది. అయితే తనకి శర్వానంద్ కి గొడవలు ఏమి జరగలేదని అయితే శర్వానంద్ ఈ సినిమాతో పాటుగా వేరే సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి "పడిపడి లేచె మనసు" మూవీ కి కాస్త గ్యాప్ తీసుకున్నాడు అని అంతేకాని మామధ్య జరిగిన గొడవ కారణం కాదని అంటోంది సాయి పల్లవి.
 
ఇదిలా ఉంటే సాయి పల్లవి ఇంతకుముందు నాగశౌర్య సరసన నటించినప్పుడు ఆ హీరోని అవమానించిందని స్వయంగా హీరో నాగశౌర్య ఏ వెల్లడించాడు. అప్పుడు కూడా నాకేమి తెలియదు నాగ శౌర్య ఎందుకు ఫీల్ అయ్యాడో ఏమో అని చెప్పింది సాయి పల్లవి. ఆ తరువాత నానితో కూడా సాయి పల్లవి గొడవ పడినట్టు వార్తలు వచ్చాయి.
 
ఇక ఇప్పుడేమో శర్వానంద్ తో గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే శర్వానంద్ తో మాత్రం నాకు గొడవలు లేవు అని చిన్న స్టేట్మెంట్ ఇచ్చి పడేసింది సాయి పల్లవి. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.