ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-10-11 05:14:47

ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం

అన్నగారు నందమూరి తారక రామారావు తన కొడుకులందరికీ కృష్ణ అనే పదం కలిసొచ్చేలా పేర్లు పెడితే, హరికృష్ణ తన కొడుకులందరికి రామ్అనే పదం కలిసొచ్చేలా పేర్లు పెట్టారు. ఇక ఆయన కొడుకులు కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకులకు అభయ్ రామ్, భార్గవ రామ్ అని పేర్లు పెట్టాడు. అయితే నందమూరి బాలకృష్ణ భార్గవరాముడు అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

ఆ విషయమే అడిగితే, సినిమా పేరు కాబట్టి కాదని, ఎప్పటినుండో తనకు ఆ పేరు అంటే చాలా ఇష్టమని చెప్పాడు ఎన్టీఆర్.  "పిల్లలకు పేర్లు పెట్టేముందు నాన్నగారి సలహాలు తీసుకునేవాళ్ళం. మా అందరికీ  ఆయన రాముడి పేరు కలిసొచ్చేలా జానకిరామ్, కల్యాణ్‌ రామ్, తారకరామ్‌ అని పేర్లు పెట్టారు.

అందుకే మా పిల్లలకు కూడా మేం అలానే పెట్టాం. జానకిరామ్‌ అన్న కొడుక్కి తారక రామారావు అని పేరు పెట్టాడు. కల్యాణ్‌ అన్న కొడుకు కి శౌర్యా రామ్‌ అని నామకరణం చేశాడు. నా పిల్లలకు అభయ్‌ రామ్, భార్గవ రామ్‌ అని పెట్టాను. నాకు చాలా ఇష్టమైన పేరు మాత్రం భార్గవ రామ్‌ అని తారక్ చెప్పుకొచ్చాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.