శ్రీరెడ్డికి 5 కోట్ల రూపాయ‌ల డీల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-04-19 12:41:57

శ్రీరెడ్డికి 5 కోట్ల రూపాయ‌ల డీల్

కాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ అట్టుడుకుతోంది అనే చెప్పాలి.. శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు..టాలీవుడ్‌ కాస్టింగ్‌ కౌచ్‌ కాంట్రవర్సీలోకి పవన్‌ కల్యాణ్‌ను లాగమని శ్రీ రెడ్డితో చెప్పింది తానేనని ఆయన బాంబు పేల్చారు.... ప‌వ‌న్ ను ఈ వివాదంలోకి లాగ‌డం వల్ల ప్ర‌జ‌ల్లోకి మ‌రింత వెళుతుంది అని తానే చెప్పాను అని వ‌ర్మ తెలియ‌చేశారు... ఈ మేరకు పవన్‌కు సారీ చెబుతూ ఆయన తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వర్మ ఓ వీడియోను ఉంచారు. 
 
ప‌వ‌న్ ను శ్రీరెడ్డి విమ‌ర్శించ‌డంలో త‌ప్పు  లేదు అని ఆయ‌న అన్నారు.. ఈ విష‌యంలో తానే ఆమెను ఇలా ప్రభావితం చేశాను అని పవన్‌ను విమర్శించటం ద్వారా కత్తి మహేశ్‌ పాపులర్‌ అయిన విషయాన్ని ఆమెతో ప్రస్తావించి.. పవన్‌ను టార్గెట్‌ చేయమని చెప్పానన్నారు. ఈ విషయంలో పవన్‌ను లాగినందుకు పవన్‌కు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతూ వర్మ ఓ ట్వీట్‌ చేశారు.
 
గతంలో శ్రీ రెడ్డితో తానూ ఓసారి ఫోటో దిగానని.. తర్వాత నిరసనల ద్వారానే ఆమెను గుర్తుపట్టానని ఆయన తెలిపారు. సురేష్‌ తనయుడు అభిరామ్‌ ఫోటోలను లీక్‌ చేశాక.. సురేష్‌ ప్రొడక్షన్‌ లాంటి ప్రముఖ సంస్థ.. రామానాయుడు కుటుంబం పరువుకు భంగం కలగకూడదన్న ఉద్దేశ్యంతో తాను డీల్‌ చేయించేందుకు ముందుకు వచ్చానని వర్మ తెలిపారు. ఆ విషయం నిర్మాత సురేష్‌ బాబుకు కూడా తెలీదని ఆయన అన్నారు. అయితే శ్రీ రెడ్డి ఆ ఆఫర్‌ను(రూ.5 కోట్లు అని చివర్లో వెల్లడించారు) సున్నితంగా తిరస్కరించందని తెలిపారు. డబ్బున్న వాళ్లు కూడా కోట్ల డీల్‌ను వదులుకునేందుకు సిద్ధంగా ఉండరని.. అలాంటిది ఆమె వద్దనటంతో ఇష్యూపై ఎంత సిన్సియర్‌గా పోరాటం చేస్తుందో అర్థమైందని వర్మ తెలిపారు.
 
ఇప్పుడు వ‌ర్మ పై మ‌ళ్లీ ప‌వ‌న్ అభిమానులు ఫైర్ అవుతున్నారు మీరు కూడా ప‌వ‌న్ పై ఇటువంటి ప్ర‌వ‌ర్త‌న చేయ‌డం బాగాలేదు అని కామెంట్లు వీడియోలు పెడుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.