మీడియా మీద విరుచుకుపడ్డ ఇళయరాజా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ilayaraja
Updated:  2018-11-02 12:37:39

మీడియా మీద విరుచుకుపడ్డ ఇళయరాజా

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ పేరు అంటే సంగీత ప్రేమికులకు, సినిమా ప్రేమికులకు ఎనలేని గౌరవం, భక్తి. ఒకానొక రోజుల్లో ఇళయరాజా పేరు చూసి కూడా సినిమాలు కొనే వారు డిస్ట్రిబ్యూటర్స్ అంటే అది అతిశయోక్తి కాదు.మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా వ్యవహరిస్తున్న తీరు చాలా మందిని కలచి వేస్తుంది. ఎన్నో అద్బుతమైన పాటలను ట్యూన్ చేసి కేవలం తమిళం, తెలుగు సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా తన పాటలతో శ్రోతలను ఆకట్టుకున్న ఇళయరాజా గారు ఇప్పుడు తన పాటలపై కాపీ రైట్ కోసం కోర్టు మెట్లు ఎక్కారు.

2014వ సంవత్సరంలో ఇళయరాజా తాను ట్యూన్ చేసిన పాటలను ఏ ఒక్కరు కూడా ఉపయోగించకూడదు.. ఏ కార్యక్రమంలో అయినా పాడుకునేందుకు లేదు అంటూ కోర్టులో పిటీషన్ వేశారు. గత నాలుగు సంవత్సరాలుగా కోర్టులో ఇళయరాజా కాపీ రైటు పిటీషన్ పై విచారణ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో తమిళ మీడియాలో ఇళయరాజా వేసిన కాపీరైట్ కేసును హైకోర్టు కొట్టి వేసింది అని, ఆ కేసులో ఇళయరాజాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది అంటూ వార్తలు జోరందుకున్నాయి. జాతీయ స్థాయి మీడియాలో సైతం ఈ వార్తే  ప్రచారం అయింది.ఈ నేపధ్యంలో ఇళయరాజా ఈ వార్తల పై స్పందించారు.

తాను 2010వ సంవత్సరంలో ఎకో రికార్డింగ్ సంస్థ పై వేసిన కేసును మాత్రమే కొట్టేశారు అని ఇళయరాజా మీడియా పై మండిపడ్డారు.కాపీ రైట్ కేసును కొట్టి వేసినట్లుగా  మీడియా తప్పుడు వార్తల్ని ప్రసారం చేయడం పట్ల ఇళయరాజా నిప్పులు చెరిగారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా వార్తలను ఎలా ప్రసారం చేస్తారు అంటూ ఆవేదన పడ్డారు.నాలుగు సంవత్సరాలు గా కాపీ రైట్ కేస్ ఫలితం కోసం ఎదురుచూస్తున్నాను.నాకు అనుకూలం గానే వస్తుందని అనుకుంటున్నాను అంటూ ఈ కేస్ మీద వివర