షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పిన ఇలియానా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine ileana d crus
Updated:  2018-07-16 12:55:17

షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పిన ఇలియానా

"దేవదాస్" సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచియమైన భామ ఇలియానా. ఆ సినిమా సక్సెస్ తరువాత దాదాపు తెలుగు లో ఆరేళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగి బాలీవుడ్ కి వెళ్ళింది ఈ భామ. "బర్ఫీ" సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అక్కడ మాత్రం సరైన సక్సెస్ ని అందుకోలేకపోయింది. కొన్నేళ్ళ పాటు అక్కడే ఉండి స్టార్ హీరోయిన్ గా వెలగాలని అనుకుంది ఇలియానా.
 
కానీ ఆమె ఆశలు నెరవేరలేదు. కాని అపుడప్పుడు తెలుగు లో సినిమాలు చెయ్యకుండా అక్కడే సినిమాలు చేస్తూ వచ్చింది ఈ భామ. అయితే ఆరేళ్ళ తర్వాత తెలుగు లో ఒక సినిమా ఒప్పుకుంది ఈ భామ. రవితేజ నటిస్తున్న "అమర్ అక్బర్ ఆంటోని" సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా యొక్క షూటింగ్ లో ఇలియాలా పార్ట్ పూర్తయింది అట.
 
45రోజులుగా అమెరికాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది, అందులో ఇలియానా 30 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంది అంట. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత అయిన తెలుగు లో ఇలియానా కి పూర్వ వైభవం వస్తుందో లేదో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.