డ‌బ్బుల కోసం ఆ... ప‌ని చేశా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-19 01:27:10

డ‌బ్బుల కోసం ఆ... ప‌ని చేశా

వెండి తెర‌పై  2006 లో వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం దేవ‌దాసు... ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది గోవా బ్యూటీ ఇలియాన డిక్రుజ్...   వీరిద్ద‌రికి  ఈ సినిమా తొలి ప‌రిచ‌యం కావ‌డంతో మంచి విజ‌యాన్ని అందుకున్నారు..  మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని అందుకున్న ఇలియాన‌... ఆ త‌ర్వాత‌ టాలీవుడ్ లో పోకిరి, మున్నా, కిక్ వంటి చిత్రాల‌లో న‌టించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
 
తాజాగా ఇలియాన చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తి క‌రంగా మారుతున్నాయి... నేటి స‌మాజంలో సాంకేతిక మాధ్య‌మాలు విప‌రీతంగా పెరిగిపోతున్నా, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో డైరెక్ట‌ర్ల తీరు, వారి మైండ్ సెట్ మాత్రం మార‌ట్లేద‌ని ఇలియాన‌ అన్నారు... కొంత మంది స్టార్ డైరెక్ట‌ర్లు గ్లామ‌ర్ పేరుతో షూటింగ్ స‌మ‌యంలో అస‌భ్య‌క‌రంగా  ఎక్క‌డంటే అక్క‌డ చేతులు వేస్తార‌ని గోవా బ్యూటీ బాధగా చెప్పింది.
 
ఇలియాన‌ మొద‌టి సినిమా దేవ‌దాసు లో కూడా ద‌ర్శ‌కుడు త‌న న‌డుము మీద శంఖం పెట్టి షూటింగ్ చేశార‌ని, అలా ఎందుకు చేస్తున్నార‌ని ద‌ర్శ‌కుడిని అడిగితే నీ న‌డుము చాలా బాగుంది.... ఈ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తే అద్భుతంగా ఉంటుంద‌ని అన్నార‌ట‌... అయితే తాను అలా ఎందుకు  అన్నారో ఇలియాన‌కు ఇప్ప‌టికి అర్థం కాలేద‌ట.
 
గ‌తంలో ఇలాంటి స‌న్నివేశాల‌ను కేవ‌లం డ‌బ్బుల‌కు మాత్ర‌మే చేశాన‌ని, ఇప్పుడు ద‌క్షిణాది నుంచి సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నా కానీ, అలాంటి స‌న్నివేశాలు త‌న‌కు ఎన్ని డ‌బ్బులు ఇచ్చినా చేయ‌న‌ని  వ్యాఖ్య‌లు చేశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.