నేను ప్రెగ్నెంట్ కావాల‌ని అనుకుంటున్నా కానీ..!

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

iliyana d cruz
Updated:  2018-06-16 10:40:39

నేను ప్రెగ్నెంట్ కావాల‌ని అనుకుంటున్నా కానీ..!

తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌లో కెరియ‌ర్ ను స్టార్ట్ చేసి త‌క్కవ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఇలియానా. హీరో మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల‌కు స‌ర‌స‌న న‌టించి తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ గోవా బ్యూటీ.
 
ఇక ఆ త‌ర్వాత టాలీవుడ్ బోర్ కొట్టిందో ఏమో మూటా ముళ్లు స‌ర్ధుకుని బాలీవుడ్ కు చెక్కేసింది.అయితే బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ‌కు మొద‌ట్లో వ‌రుస అవ‌కాశాలు వచ్చాయి. బ‌ర్ఫీ వంటి సూప‌ర్ హిట్ సినిమాల్లో ఇలియానా న‌టించి అక్క‌డ‌ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత గోవా బ్యూటీకి పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. వ‌చ్చిన అవ‌కాశ‌ల్లోనే కెరియ‌ర్ ను ముందుకు సాగిస్తోంది. ఒకానోక స‌మ‌యంలో కెరియ‌ర్ గురించి డైల‌మాలో కూడా ప‌డింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.
 
ఇక అదే టైమ్ లో ఈ ముద్దుగుమ్మ‌కు ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాపర్ ఆండ్రూస్ తో పరిచయమైంది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఇక ఈ ప్రేమ వ్య‌వ‌హారం ఆ నోట ఈనోట చేరి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంపై మీడియా స్పందిస్తే అందుకు ఇలియానా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. 
 
ఇక రీసెంట్ గా ఆమె ప్రెగ్నెంట్ అయింద‌నే వార్త‌లు వస్తున్నాయి. ఇక ఈ వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు ఇలియానా స్పందించింది. నేను ఇంకా ప్రెగ్నెంట్ కాద‌ని ఆ వార్త‌లో నిజం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఒక వేళ‌ నేను ప్రెగ్నెంట్ అయితే ఆ విష‌యాన్ని తాను ఆనందంగా చెబుతాన‌ని చెప్పింది. అలాగే తాను ప్రెగ్నెంట్ అవ్వాల‌ని ఎప్ప‌టినుంచో ఆలోచిస్తున్నాన‌ని, కానీ దినికి ఇంకా టైమ్ ఉంద‌ని చెప్పింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.