దిల్ రాజు అడిగిన దానికి నో చెప్పిన మహేష్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu and dil raju
Updated:  2018-10-29 05:38:40

దిల్ రాజు అడిగిన దానికి నో చెప్పిన మహేష్ బాబు

ఒకానొక రోజుల్లో సాదాసీదా హీరోలతో కూడా కుటుంబ కథా చిత్రాలు తీసి హిట్ కొట్టిన నిర్మాత దిల్ రాజు. కధ ని జడ్జ్ చెయ్యడం లో, సినిమాలు తియ్యడంలో మంచి టేస్ట్ ఉన్న నిర్మాత గా దిల్ రాజు కి మంచి పేరు ఉంది.కానీ దిల్ రాజు టైం ఈమధ్య అసలు బాగుండడం లేదు. ఏ సినిమా కూడా ఆశించిన స్థాయి లో విజయాన్ని అందుకోలేకపోతున్నాయి దిల్ రాజు సినిమాలు ఈ మధ్య. అయితే మళ్ళీ స్టార్ హీరో తో సినిమా మొదలు పెట్టాడు దిల్ రాజు.
 
మహేష్ బాబు హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ చిత్రంలో కథానుగుణంగా రెండు ఫైట్లు మాత్రమే ఉన్నాయట, దాంతో ఆ రెండు ఫైట్లకు తోడూ మరో రెండు ఫైట్లు జోడించమని హీరోని, దర్శకుడిని కోరుతున్నాడట దిల్ రాజు. ఎందుకయ్యా ఈ కోరిక అంటే హిందీ రైట్స్ అమ్ముకోవడానికి. హిందీలో ఫైట్స్ ఎక్కువగా ఉంటే మంచి బేరం కుదురుతోంది, ఫైట్స్ తక్కువగా ఉంటే అంతగా డిమాండ్ లేదు దాంతో మరో రెండు ఫైట్ల ని జోడించమని కోరుతున్నాడు దిల్ రాజు. దానికి మహేష్ కుదరదు అంటున్నాడట.
 
కథకు అవసరమైన చోట ఫైట్స్ ఉండాలి కానీ హిందీ రైట్స్ కోసం ఫైట్స్ పెట్టడం ఏంటి..? అని దిల్ రాజు తో విభేదిస్తున్నాడట మహేష్ బాబు.ఆ మధ్య స్పైడర్‌తో దెబ్బ తిని భరత్ అనే నేనుతో మళ్లి కోలుకున్న మహేష్ ఇప్పుడు ప్రయోగాలు చేయదలుచుకోలేదని అర్ధం అవుతుంది. మరి మహేష్ తలోగ్గుతాడా ? లేక ఈ అగ్ర నిర్మాత తగ్గుతాడా అనేది సినిమా రిలీజ్అయితే కానీ తెలీదు.

షేర్ :

Comments

0 Comment