సుభాష్ ఘాయి పైన మరొక షాకింగ్ ఆరోపణ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

subash ghai
Updated:  2018-10-15 04:46:23

సుభాష్ ఘాయి పైన మరొక షాకింగ్ ఆరోపణ

ఇప్పటికే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సుభాష్ ఘాయ్ తనను లైంగికంగా వేధించాడంటూ ఒక అమ్మాయి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుభాష్ ఘాయ్ పైన మోడల్ కేట్ శర్మ ఏకంగా పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. గత ఆగస్టు 6వ తారీకున సుభాష్ ఘయ్ తనను ఇంటికి రమ్మని పిలిచాడని, సినిమా గురించి చర్చించాలని చెప్పడంతో తాను అక్కడకు వెళ్లానని చెప్పిన కేట్ శర్మ వెళ్లగానే కొద్ది సమయం మర్దన చేయాలని సుభాష్ కోరాడట.

ముందు షాక్ అయినా పెద్దాయన అడిగాడు కదా అని మూడు నిమిషాలు మర్ధన చేశాను. తరువాత చేతులు కడుక్కోడానికి వాష్ రూం కు వెళ్లాను. నా వెనకే వచ్చి సుభాష్ ఘాయి నన్ను కౌగిలించుకుని బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అని చెప్పింది కేట్. ఆయన ప్రవర్తనకు షాక్ అయ్యి దూరం జరిగాను. నన్ను రూంలోకి రా అంటూ బలవంతంగా లాగే ప్రయత్నం చేశాడు.

ఆ రోజు రాత్రి నన్ను అక్కడే ఉండమని ఫోర్స్ చేశాడు. నేను ఉండకపోతే రాత్రి భోజనం చేయనంటూ బెదిరించాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది కేట్. సుభాష్ ఘయ్ కూడా వీటిపై స్పందించి ఆమె ఆరోపణలను తన లాయర్ లు చూస్తుంటారని, ఆమె చేసిన ఆరోపణలు నిరూపించుకోలేకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించాడు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు