సన్నీ ఫోటోకి నిప్పంటించిన ఆందోళనకారులు..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sunny leone
Updated:  2018-10-10 11:23:12

సన్నీ ఫోటోకి నిప్పంటించిన ఆందోళనకారులు..

పోర్న్ స్టార్ గా కెరీర్ మొదలు పెట్టిన సన్నీ లియోన్ బాలీవుడ్ లో నటిగాను, టాలీవుడ్ లో ఐటమ్ నెంబర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే ఈమెను వీర మహాదేవి సినిమాలో హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెల్సిందే. కానీ సన్నీ ఈ సినిమాలో హీరోయిన్ అయితే ఊరుకునేది లేదు అంటూ చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక యువసేన కార్యకర్తలు నగరంలో సోమవారం ధర్నా చేశారు.

వీర మహాదేవి సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం తో పాటు మరొక ఐదు భాషలో విడుదలవనుంది.100 కోట్ల బడ్జెట్ తో నిర్మాణమవుతున్న ఈ సినిమా నిర్మాత డిసి వాడి ఉదయన్, సన్నీ లియోన్ ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళనకారులు. ఒకవేళ సన్నీ ఈ సినిమాలో నటిస్తే, రాష్ట్రంలో విడుదల అవ్వనిచ్చే ప్రసక్తే లేదు అంటూ బెదిరింపులు చేశారు.

సన్నీలియోన్ పై ప్రజల్లో తనదైన అభిప్రాయం ఉందని, ఇటువంటి నటి వీర రాణి సినిమాలో కనిపించరాదని, అలా చేస్తే అది వీర మహాదేవికి అవమానమని అన్నారు. అంతే కాకుండా సన్నీలియోన్, నిర్మాత చిత్ర పటాలకు నిప్పు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిత్ర బృందం ఇంకా ఈ విషయమై రియాక్ట్ అవ్వాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.