‘మా’లో మాకే వివాదం దాన్ని మేమె సరిజేసుకుంటాం..నరేష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

maa
Updated:  2018-09-03 06:19:09

‘మా’లో మాకే వివాదం దాన్ని మేమె సరిజేసుకుంటాం..నరేష్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో వివాదాలు కొత్తేమి కాదు. మొన్న జరిగిన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లలో నిధులు కాజేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన సమావేశం నిన్న సుమారు ఐదు గంటలసేపు జరిగింది. ఈ సమావేశం లో ప్రస్తుత “మా” అధ్యక్షుడు శివాజీ రాజా సమస్య పరిష్కారం అవ్వకుండా జర్నలిస్టుల పై బూతు పురాణం తో రెచ్చిపోయాడని వినికిడి. రిపోర్టర్స్ పై ఊరకనే మండిపడుతు, తనకున్న కాంటాక్ట్స్ తో ఈ గోడవకి ఫుల్ స్టాప్ పెట్టేస్తా అని చెప్పినట్టు సమాచారం.

పక్కనే ఉన్న శ్రీకాంత్ ఎంత ట్రై చేసిన శివాజీ కంట్రోల్ అవ్వకపోవడం గమనార్హం.మెగాఫ్యామిలీతో శ్రీకాంత్ చాలా చనువుగా ఉంటాడనేది అందరికి తెలిసిన విషయమే అందువల్ల చిరంజీవిని ఇందులోకి లాగితే ఆయనే చూసుకుంటాడు అనే భావన లో శివాజీ రాజా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ దానికి భిన్నంగా చిరు మాత్రం ఈ విషయంలో అస్సలు జోక్యం చేస్కోకుడదని ధృడనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

బెనర్జీ, నాగినీడు, శ్రీకాంత్, శ్రీరామ్ లాంటి వారు మాత్రమే శివాజీకి మద్దతు తెలుపగా మిగతవారంత ఒక ఎంక్వరీ వెయ్యలని కోరారు.కాగా నరేష్ మాత్రం తమలో తమకు కొన్ని కొన్ని విబేధాలు ఉండటం వల్ల ఇలా జరిగిందని అవి తామే సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.