ఆ సినిమాలో ఆది పాత్ర హైలైట్ అటా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-25 04:19:45

ఆ సినిమాలో ఆది పాత్ర హైలైట్ అటా

ఈ ఏడాది "రంగస్థలం" సినిమాలో కుమార్ బాబు పాత్రలో నటించి అందరిని మెప్పించిన నటుడు ఆది పినిశెట్టి. తాజాగా ఆయన నటిస్తున్న నూతన చిత్రం "నీవెవరో". తమిళ చిత్రం "అదే కంగాళ్" కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో తాప్సి, "గురు"ఫేమ్  రితికా సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఒక అంధుడైన చెఫ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ పాత్రకోసం ఆది చాలా కష్టపడ్డాడని సమాచారం. ముఖ్యంగా ఈ పాత్ర కోసం ఆది కొంతమంది చెఫ్ లతో కలిసి వారి నుంచి అనేక విషయాలను తెలుసుకున్నాడట, అలానే కొంత మంది అంధులతో ముచ్చటించి వారి జీవన విధానాన్ని, బాడీ లాంగ్వేజ్ ని దగ్గరుండి పరిశీలించాడట ఆది.

దీంతో ఈ సినిమా విడుదలయ్యాక ఆది నటన గురించి అందరు గొప్పగా చెప్పుకుంటరనే నమ్మకంతో ఉంది చిత్రబృందం. ఇక ఈ చిత్ర ఆడియో ను ఈ నెల ఆఖరున విడుదల చేసి, ఈ చిత్రాన్ని ఆగస్టు చివరివారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.