రాజ‌కీయాల‌పై క్లారిటీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-04-14 18:32:34

రాజ‌కీయాల‌పై క్లారిటీ

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన హీరో జ‌గ‌ప‌తి బాబు...ఈయ‌న తెలుగు రాష్ట్రాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి.... గ‌తంలో జ‌గ్గు భాయ్ హీరోగా న‌టించిన చిత్రాల‌న్ని సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డంతో తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు... ఆ త‌ర్వాత కొంత కాలంపాటు తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌గ్గు భాయ్ కి పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.. దీంతో జ‌గ‌ప‌తి త‌న రూట్ మార్చుకొని ప్ర‌తినాయ‌కుడిగా  మారిపోయారు.
 
అలా ప్ర‌తినాయ‌కుడిగా  న‌టించిన చిత్రం లెజెండ్... ఈ సినిమాలో బాల‌కృష్ణ‌కు  విల‌న్ గా  న‌టించి చాలా రోజుల‌ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌రోసారి త‌న‌కంటూ ప్ర‌త్యేక  ఫేమ్ ను  తెచ్చుకున్నారు జ‌గ‌ప‌తి బాబు. ఇక తాజాగా త‌న రాజ‌కీయ అరంగేట్రం పై కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు జ‌గ్గు భాయ్ .. గ‌తంలో కుడా త‌న‌ను రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని అనేక మంది పిలిచార‌ని అన్నారు.
 
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయ‌న మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి వెళ్ల‌న‌ని స్ప‌ష్టం చేశారు.. త‌న జీవితం సినిమాల‌కే అంకితం చేస్తాన‌ని తాను న‌టించబోయే చిత్రాల‌లో  ఎలాంటి పాత్రలొచ్చినా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని  జగపతిబాబు అన్నారు, సినిమాలో పాత్ర కోసం అవసరమైతే గుండుతో నైనా నటిస్తానని చెప్పారు... అంతే త‌ప్ప రాజ‌కీయాల్లోకి మాత్రం వెళ్ల‌న‌ని స్ప‌ష్టం చేశారు.
 
అలాగే  ప్రత్యేకహోదా ఉద్యమానికి సినీ పరిశ్రమ దూరంగా లేదని, అవసరమైనప్పుడు స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని జ‌గ‌ప‌తి బాబు అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.