నా అంత నీచుడు ఎవ్వడు లేడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-10 17:49:51

నా అంత నీచుడు ఎవ్వడు లేడు

హీరో జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ క్యారెక్టర్స్ తో అదరగోడుతున్నాడు. "లెజెండ్" సినిమాతో విలన్ గా మారిన ఈ హీరో ఆ తరువాత చాలా సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం జగపతి బాబు "సాక్ష్యం" అనే సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.
 
ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి జగపతి బాబు మాట్లాడుతూ, అసలు ప్రపంచంలో ఇంత నీచమైన క్యారెక్టర్ ఎక్కడ ఉండదు డబ్బు కోసం ఏమైనా చేసే పాత్రలో నటించాను అని తను పోషించిన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు జగపతి బాబు.
 
అలాగే ఇదివరకు నేను "లెజెండ్" సినిమాలో విలన్ పాత్రకి ఇగో ఉంటుంది, అలాగే "జయజానకి నాయక" మూవీ లో విలన్ పాత్రకి పరువు పిచ్చి ఉంటుంది, కాని "సాక్ష్యం" సినిమాలో విలన్ పాత్రకి కేవలం డబ్బు అంటేనే పిచ్చి అని తన పాత్ర యొక్క స్వభావాన్ని బయటపెట్టేసాడు జగపతి. అసలు షూట్ అయిపోయాక నేను కూడా ఆ పాత్రలాగే మారిపోతనేమో అని చాలా భయం వేసింది. కాని దేవుడి దయ వల్ల అలా జరగలేదు అని అన్నాడు ఈ క్రేజీ విలన్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా జూలై 27 న రిలీజ్ అవుతుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.