శ్రీదేవి కూతురు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-06-19 16:43:26

శ్రీదేవి కూతురు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

దివంగ‌త న‌టి శ్రీదేవి త‌న కుమార్తెను తెరపై చూడాలి అని ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది.. కాని ఆమె కోరిక తీర‌కుండానే చివ‌ర‌కు మ‌ర‌ణించింది ఆమె.. అయితే ఆమె మ‌ర‌ణంతో ఇటు దేశంలో ఆమె అభిమానులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అయితే శ్రీదేవి కుమార్తె జాన్వీక‌పూర్ న‌టించిన తొలిచిత్రం థడక్ గురించే ఇప్పుడు అంతా చ‌ర్చ జ‌రుగుతోంది.ఈ సినిమా ట్రైల‌ర్ కు ఇప్ప‌టికే విశేష స్పంద‌న వ‌స్తోంది.
 
ఇక ఈ సినిమాపై ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు చిత్రయూనిట్..  ఇటు క‌పూర్ ఫ్యామిలీ కూడా జాన్వీకి ఈ సినిమా ఎంతో పేరు తీసుకువ‌స్తుంది అని ఆనందంలో ఉన్నారు... ఈ చిత్రంలో ఈషాన్ ఖ‌ట్ట‌ర్ హీరోగా న‌టించారు..ఇక తాజాగా ఈ సినిమాలో ఎవ‌రెవ‌రి పారితోషికాలు ఎంత అంటూ ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
 
ఈ సినిమాని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శ‌శాంక్ ఖేతాన్ పారితోషికం 4 కోట్ల రూపాయ‌లని తెలుస్తోంది.. సినిమా ర‌చ‌యిత నాగ‌రాజ్ కు రెండు కోట్ల రూపాయ‌లు పారితోషికం వ‌చ్చింద‌ట‌.. ఇక అజ‌య్‌- అతుల్ సంగీతానికి అర‌కోటి రూపాయ‌లు ఇచ్చారు అని తెలుస్తోంది... ఇక ఈ సినిమాలో జాహ్న‌వి తండ్రిగా న‌టించిన అశుతోష్ రాణాకు 50 ల‌క్ష‌లు పారితోషికం తీసుకున్నారు అని తెలుస్తోంది.. ఇక తొలి సినిమాతో తెరంగేట్రం చేస్తున్న జాన్వీక‌పూర్ కు పారితోషికం 45 ల‌క్ష‌లు అని తెలుస్తోంది. ఇక హీరోగా న‌టిస్తున్న ఈషాన్ ఖ‌ట్ట‌ర్ కు 70 ల‌క్ష‌ల రూపాయ‌ల పారితోషికం అని తెలుస్తోంది... మొత్తానికి ఈ సినిమాపై బాలీవుడ్ లో ఎంతో క్రేజ్ పెరిగింది అనే  చెప్పాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.