శ్రీదేవి కూతురు కి పోటీ గా సైఫ్ అలీ ఖాన్ కూతురు ..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sara khan and janvi kapoor
Updated:  2018-10-31 04:48:38

శ్రీదేవి కూతురు కి పోటీ గా సైఫ్ అలీ ఖాన్ కూతురు ..

భారతీయ పరిశ్రమలలో ప్రతి దాంట్లో వారసత్వం కామన్, వ్యాపారం అయిన , సినిమా అయినా... అయితే
బాలీవుడ్ లో వారసత్వ నాయికల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. సెలబ్రిటీ కుమార్తెలు కథానాయికలుగా నటిస్తున్నారు. కరీనాకపూర్, శ్రద్ధా కపూర్, సోనమ్ కపూర్, అలియా భట్, సోనాక్షి సిన్హా వీళ్లంతా సీనియర్లు అయిపోయారు. ప్రస్తుతం జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అహనా పాండే లాంటి భామలు వారతసత్వ ట్రెండ్ ని కొనసాగిస్తున్నారు.
 
ఇటీవలే జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆరంగేట్రం అదరగొట్టి అందరి మన్ననలు పొందింది ఈ భామ.. సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె సారా అలీఖాన్ కేదార్ నాథ్సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో  సుషాత్ సింగ్ రాజ్ పుత్ సరససన సారా రొమాన్స్ చేస్తోంది. తాజాగా ఆ సినిమా ట్రైలర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ లో ఫెయిర్ క్యూట్ అప్పీల్ తో మైమరిపించింది. మంచు కొండల అందాలతో ఈ భామ అందాలు చూడముచ్చటగా ఉన్నాయి. సారా-సుశాంత్ ల జోడీ  చూడముచ్చటగా ఉంది. ఇక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూడాలంటే రెండు కళ్లు చాలవేమో అన్నట్టుగా ఉంది వీరి జంట. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.గతంలో  జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ధడక్ పోస్టర్ అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.