హ్యాపీ బర్త్ డే తో ప్రభాస్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-10-23 12:17:09

హ్యాపీ బర్త్ డే తో ప్రభాస్

ప్రభాస్.. ఆరడుగుల ఆజానుబాహుడు అనే మాటకు అసలు సిసలు కటౌట్. సంచలనానికి కరెక్ట్ అడ్రస్. హీరో అంటే ఇలా ఉండాల్రా అనిపించే రూపం. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 16 సంవత్సరాలు.. చేసినవి 18 సినిమాలు. అందులో విజయాలు ఉన్నాయ్. అంతకు మించి అపజయాలు ఉన్నాయి. హిట్టొస్తే కాలర్ ఎగరేయడు.. ఫ్లాప్ వచ్చింది కదా అని కుంగిపోడు. అతడి నైజం వైవిధ్యం.. అతడి మార్గం కమిట్ మెంట్. అందుకే అతడు దర్శకులకు ఇష్టమైన డార్లింగ్, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే మిస్టర్ పర్‌ఫెక్ట్. నేడే ఈ నేషనల్ స్టార్ బర్త్ డే. ఆయన మీద స్పెషల్ కథనం అందిస్తుంది మా జనహితం.. 
 
తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్‌లా దూసుకుపోతున్న మిస్టర్ పర్‌ఫెక్ట్. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్‌కు డార్లింగ్. త్వరలో ‘సాహో’ అంటూ పలకరించబోతున్నాడు. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి ప్రభాస్.. ఒకపక్క మిస్టర్ ఫర్ఫెక్ట్‌గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనే.. మరో పక్క మిర్చిలా రికార్డుల ఘాటును పెంచాడు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తాడు. కసి, కోపం, ప్రేమ, యాక్షన్, ఎమోషన్ సీన్ ఏదైనా.. ఎంతో ఈజ్‌తో చేయడం ప్రభాస్ స్పెషాలిటి.
 
ఈశ్వ‌ర్‌ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘ఛత్రపతి’తో యాక్షన్ హీరోగా...బుజ్జిగాడుతో మాస్ హీరోగా అలరించి...బాహుబలితో హాలీవుడ్ వరకూ తన సత్తా చాటాడు ప్రభాస్.తెలుగు సినిమా స్థాయి హాలీవ