తండ్రి కొడుకుల మరణాలు రెండు ఒకేలా ఉన్నాయి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

harikrishna and janaki ram
Updated:  2018-08-29 03:28:20

తండ్రి కొడుకుల మరణాలు రెండు ఒకేలా ఉన్నాయి

ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం లో హరికృష్ణ మృతి చెందిన విషయం యావత్ తెలుగు ప్రజలకి షాకింగ్ గా ఉంది. అయితే ఇక్కడ హరికృష్ణ ఇంకా అతని పెద్ద కొడుకు జానకిరామ్ ఇద్దరు ఒకే రీతిలో చనిపోయారు.

2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకిరామ్ స్వయంగా కారు నడుపుకుంటూ వేగంగా వెళ్తూ ఎదురుగ వస్తున్న ట్రాక్టర్ ని తప్పించబోయి మృత్యువాత పడ్డాడు కాగా ఆ సంఘటనలో కూడా జానకిరామ్ సీటు బెల్ట్ పెట్టుకోలేదు, ఒకవేళ సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే జానకిరామ్ గాయాలతో బయటపడేవాడేమో అని చాలా మంది అనుకున్నారు.

క ఈరోజు జరిగిన ఘోర రోడ్ యాక్సిడెంట్ లో కూడా నందమూరి హరికృష్ణ అత్యంత వేగంతో 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడంతో పాటు సీటు బెల్టు కూడా పెట్టుకోలేదు, ఒక వేళ సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే ఆయన కూడా బ్రతికే ఇప్పుడు మన మధ్య హ్యాపి గా తిరిగే వారు. దీన్ని బట్టి చూస్తే ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని కార్లు ఉన్నా కూడా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల మన ప్రాణానికే ప్రమాదం అని మనం గ్రహించాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.