మహర్షి"లో నటిస్తున్న అలనాటి స్టార్ హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

maharshi
Updated:  2018-08-21 06:46:27

మహర్షి"లో నటిస్తున్న అలనాటి స్టార్ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా "మహర్షి". మహేష్ 25 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజులు ఇద్దరు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. కామెడీ హీరో అయిన అల్లరి నరేష్ ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ జయప్రద ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది అంట. ఇందులో ఆవిడ మహేష్ తల్లి పాత్ర పోషిస్తున్నారట. ఎంతో కీలకమైన ఈ పాత్రకు జయప్రద అయితేనే న్యాయం చేయగలరని భావించి ఆవిడని ఎంపిక చేసాడట వంశీ.

ప్రస్తుతం ఆమె తెలుగు లో పెద్ద సినిమాల్లో నటించట్లేదు. ఆమె తెలుగు లో నటించిన ఆఖరి పెద్ద సినిమా "మహారధి". ఇక సూపర్ స్టార్ కృష్ణ తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించిన జయప్రద తొలిసారి మహేష్ తో నటిస్తుండటం మరింత విశేషం అని భావిస్తున్నారు కృష్ణ -మహేష్ అభిమానులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.