ఒక్కటే చోట షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్, బాలకృష్ణ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr and balakrishna
Updated:  2018-07-18 11:53:29

ఒక్కటే చోట షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్, బాలకృష్ణ

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న "అరవింద సమేత" సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే బాలకృష్ణ కూడా "ఎన్టీఆర్" బయోపిక్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఈ రెండు సినిమాలకి సంభందించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.
 
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న అరవింద సమేత సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాలేజీ సెట్ వేసి ఎన్టీఆర్, పూజ హెగ్డే లపై కొన్ని సీన్స్ చేశారు. ఇదిలా ఉండగా బాలయ్య తీస్తున్న "ఎన్టీఆర్" బయోపిక్ షూటింగ్ కూడా ఇదే ఫిల్మ్ సిటీలో మరోచోట జరుగుతోంది.
 
ఈనాడు అధిపతి అయిన రామోజీరావు ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లి డైరెక్టర్ క్రిష్‌ను కలిసి అభినందించాడు కూడా కాని పక్క సెట్ లో ఎన్టీఆర్ మాత్రం బాబాయ్ సెట్స్ లోకి రాలేదు, అలాగే బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ సినిమా సెట్స్ కి వెళ్ళలేదు. ఇదిలా ఉంటే గత కొన్నేళ్ళుగా బాలకృష్ణ ఇంకా ఎన్టీఆర్ కి పడట్లేదు అనే టాక్ బయట గట్టిగా వినిపిస్తుంది. అందుకే వీళ్ళిద్దరూ ఏ పబ్లిక్ ఈవెంట్స్ లో గాని ఫ్యామిలీ ఫంక్షన్ లో గాని అస్సలు మీట్ అవ్వట్లేదు కాబోలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.