పవన్ కళ్యాణ్ స్టామినాని అందుకోలేకపోయిన ఎన్టీఆర్....కారణం ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr and pawan kalyan
Updated:  2018-10-12 01:10:13

పవన్ కళ్యాణ్ స్టామినాని అందుకోలేకపోయిన ఎన్టీఆర్....కారణం ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు చేసిన ఆఖరి సినిమా అజ్ఞాతవాసి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. డిజాస్టర్ ఐనప్పటికీ ఈ సినిమా కొన్ని రికార్డులను సైతం బద్దలు కొట్టింది.

కేవలం ప్రీమియర్ షో ల తోనే ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 1.5 మిలియన్ డాలర్లను చేరుకుని రికార్డును సృష్టించింది. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించింది ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రానికి కాబట్టి ఈ సినిమా అజ్ఞాతవాసి రికార్డు ను బద్దలు కొడుతుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ ను పొంది రికార్డు సృష్టించింది కానీ అజ్ఞాతవాసి రికార్డు మాత్రం అందుకోలేకపోయింది.

కేవలం ప్రీమియర్ షో ద్వారా ఎన్టీఆర్ అమెరికాలో 8 లక్షలకు పైగా కలెక్షన్లు రాబట్టాడు. ఇక రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ను చినబాబు అలియాస్ రాధా కృష్ణ నిర్మించారు. త్రివిక్రమ్ మొట్టమొదటిసారి యాక్షన్ సినిమా ను ట్రై చేసినప్పటికీ, సినిమా సూపర్ హిట్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఇక ఈ సినిమా కచ్చితంగా మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.