తెలంగాణా గడ్డ మీద జూనియర్ ఎన్టీఆర్ హవా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-05 17:46:19

తెలంగాణా గడ్డ మీద జూనియర్ ఎన్టీఆర్ హవా ?

కెరీర్ లో తోలిసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కలిసి పని చేస్తున్నారు. వీళ్ళ కాంబినేషన్ లో ఒక హై బడ్జెట్ ఫ్యామిలీ డ్రామా రూపొందుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా కి అరవింద సమేత అని టైటిల్ పెట్టి ఇటివలే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఇప్పటికే ఈ సినిమా యాబై శాతం కి పైగా షూటింగ్ ని పూర్తీ చేసుకుంది.

అయితే తాజా సమాచారం మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా యొక్క తదుపరి షెడ్యూల్ ని వరంగల్ లో జరపాలి అని డిసైడ్ చేసాడు అట, ఇప్పటికే త్రివిక్రమ్ తన టీం తో వెళ్లి అక్కడ లొకేషన్ రెక్కి కూడా చేస్తున్నాడు. మూవీ లో వచ్చే కొన్ని ముఖ్య సన్నివేశాల్ని వరంగల్ లో తీయబోతున్నారు మూవీ యూనిట్.

దీన్ని బట్టి చూస్తుంటే త్వరలో జూనియర్ ఎన్టీఆర్ వరంగల్ గడ్డ మీద తన నట విశ్వరూపాన్ని చూపించ బోతున్నాడు అని అర్ధం అవుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని రాధా కృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎస్.ఎస్ తమన్ ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది దసరా సంధర్బంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.