బాధలోనూ డాన్స్ కుమ్మేస్తున్న ఎన్టీఆర్..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr
Updated:  2018-09-10 04:36:00

బాధలోనూ డాన్స్ కుమ్మేస్తున్న ఎన్టీఆర్..

ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్ ప్రమాదం లో మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ మరో వైపు "అరవింద సమేత" షూటింగ్ ఉంది. తన వల్ల ఒక ప్రొడ్యూసర్ అస్సలు నష్ట పోకూడదు అనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి మరణించిన మూడో రోజు నుంచే "అరవింద సమేత" షూటింగ్ లో పాల్గొన్నాడు.

మొన్నటి వరకు కేవలం సీన్స్ మాత్రమే షూట్ చేసిన మూవీ యూనిట్ ఇప్పుడు సాంగ్స్ ని షూట్ చేస్తున్నాడు. అంత బాధలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేస్తున్నాడు అంట. ఈ విషయాన్నీ సినిమా సంగీత దర్శకుడు తమన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో అభిమానులు ఇంకా ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు.

తమ అభిమాన హీరో క్లిష్టమైన పరిస్థితుల్లో షూటింగ్‌కి హాజరవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, అతనికి బాసటగా నిలుస్తున్నారు. మరి ఎన్టీఆర్ కష్టం కోసం అయిన సినిమాని హిట్ చేయాలి అనే దిశగా అభిమానులు ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఈశ రెబ్బ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.