ఎన్టీఆర్ సినిమాకు టైటిల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr.ntr
Updated:  2018-05-11 03:53:21

ఎన్టీఆర్ సినిమాకు టైటిల్

తెలుగుచిత్ర పరిశ్ర‌మ‌లో వ‌రుస హిట్ల‌తో ముందుకు దూసుకు వెళ్తున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్. రీసెంట్ గా ఆయ‌న న‌టించిన  చిత్రం జై ల‌వ కుశ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ముందు నంద‌మూరి అభిమానుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది.. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు రాయలసీమ నేపథ్యంలో చిత్రించ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో సీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్ ను త‌యారుచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్  సరసన పూజా హెగ్డే నటిస్తోంది.
 
సెట్స్‌పై ఉన్న ఈ చిత్రానికి తాజాగా ఓ టైటిల్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేయ‌నుందంటూ జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అసమాన్యుడు అనే టైటిల్ ప‌రిశీలిస్తోంద‌ట ఆ ఆలోచ‌న‌లో చిత్రబృందం ఉందని ఫిల్మ్‌నగర్‌ జనాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో పాటు మ‌రో పేరు కూడా ప్ర‌చారం సాగుతోంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.
 
ఇక తాజాగా ఈ టైటిల్ పై చిత్ర యూనిట్ స్పందించింది. తాము ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి టైటిల్ ను విడుద‌ల చేయ‌లేద‌ని తెలిపింది.. అసమాన్యుడు అనే పేరు త‌మ ప‌రిగ‌ణ‌లో లేద‌ని చిత్ర‌యూనిట్ స్ప‌ష్టం చేసింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి  త్వరలోనే కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నామ‌ని తెలిపింది చిత్ర యూనిట్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.