ఎన్టీఆర్ బ‌యోపిక్ పై జూ ఎన్టీఆర్ స్పంద‌న‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr
Updated:  2018-07-14 11:29:46

ఎన్టీఆర్ బ‌యోపిక్ పై జూ ఎన్టీఆర్ స్పంద‌న‌

నందమూరి బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి గత కొంత కాలంగా విబేధాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ఏ ఒక్క ఫంక్షన్స్ లో గాని మీటింగ్స్ లో కలిసి కనబడలేదు. ఎన్టీఆర్, బాలకృష్ణ కి ఎంత దగ్గరవుదాం అని చూస్తున్న గాని బాలకృష్ణ మాత్రం అందుకు అస్సలు సహకరించట్లేదు అని తెలుస్తుంది.

మొన్నటి వరకు జగపతి బాబు వీళ్ళ ఇద్దరినీ కలపాలి అని చూసాడు కాని ఇప్పుడు అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇదిలా ఉంటే ఇటివలే జూనియర్ ఎన్టీఆర్ హైదరబాద్ లో ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్ లో "ఎన్టీఆర్" బయోపిక్ లో మీరు నటిస్తున్నారా అని ఒకతను అడిగితే. తాత గారి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ వస్తుంది అంటే చాల సంతోషంగా ఉంది.

కాని నాకు ఆ మూవీ లో నటించమని బాబాయ్ దగ్గర నుంచి ఎలాంటి పిలుపు రాలేదు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ని ఈ ప్రాజెక్ట్ కోసం అస్సలు తీసుకోవట్లేదు అని టాక్. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్ ని వారాహి చలని చిత్రం పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.