త‌న భార్య గురించి ఎవ‌రికి తెలియ‌ని విష‌యం చెప్పిన ఎన్టీఆర్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr and pranathi
Updated:  2018-10-09 11:22:59

త‌న భార్య గురించి ఎవ‌రికి తెలియ‌ని విష‌యం చెప్పిన ఎన్టీఆర్‌

వరుస హిట్ సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు అరవింద సమేత సినిమాతో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా అక్టోబర్ 11 న విడుదలకై సిద్ధంగా ఉండగా, ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ సినిమా ప్రోమోషన్స్ లో యాక్టీవ్ గా పాల్గొంటున్నారు. ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యంగ్ టైగర్ తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి, ఆమె వంట గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇంట్లో మీ భార్యే వంట చేస్తారా అని అడిగితే ఎన్టీఆర్ ఇలా రియాక్ట్ అయ్యాడు. దేవుడా! ఏం మాట్లాడుతున్నారు మీరు..? మీరు నా భార్య గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆమెకు వంట రాదు. ఒకవేళ ఎవరన్నా తిన్నా సరే ఇంట్లోంచి పారిపోవాల్సిందే. మా ఇంట్లో నేనే బాగా వంట చేస్తాను. నాకు అన్ని రకాల వంటలు వచ్చు. మా అమ్మగారు నాకంటే బాగా వంట చేస్తారు.

ఇంట్లో ఎప్పుడూ మేమిద్దరమే వండేది. అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అంతే కాక తనకు ఇల్లు చాలా నీట్ గా పరిశుభ్రంగా ఉండాలని కానీ తన భార్య అలా కాదని తను అన్ని అస్తవ్యస్తంగా పడేస్తుందని చెప్పాడు. కంప్లైంట్ చేస్తున్నట్టు కాకుండా సరదాగానే చెప్పాడు సుమీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.