ఎన్టీఆర్ అన్న మాటలకు యూనిట్ సభ్యులు షాక్ అయ్యారట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr
Updated:  2018-10-09 05:28:00

ఎన్టీఆర్ అన్న మాటలకు యూనిట్ సభ్యులు షాక్ అయ్యారట

ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ  అకాల మృతి తో నందమూరి కుటుంబం లోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఆ ఘటనతో కదిలిపోయారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ సమయంలో త్రివిక్రమ్ తనకు ధైర్యం చెప్పాడని ఎన్టీఆర్ చెప్పాడు.

ఆ విషయం ప్రస్తావిస్తూ వాస్తవానికి ప్రీరిలీజ్ వేడుక సమయంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అప్పటికి హరికృష్ణ మరణం అందరి మైండ్ లో ఉంది. నేనేం మాట్లాడాలనుకున్నా మాట్లాడాలనిపించలేదు కూడా. అందుకే ఆరోజు అన్నీ తారక్ కే వదిలేశాను. ఆ సమయంలో ఎన్టీఆర్ వెన్నంటి ఉండడమే ముఖ్యం అనిపించింది అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్. అయితే హరికృష్ణ మరణ వార్త విన్న వెంటనే చినబాబు (నిర్మాత రాధాకృష్ణ), త్రివిక్రమ్ మాట్లాడుకుని సినిమాని వాయిదా వేసి సమ్మర్ కే రిలీజ్ చేయాలని అనుకున్నారట.

కానీ ఆశ్చర్యకరంగా ఆ ఘటన జరిగిన రెండో రోజే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కు ఫోన్ చేసి సినిమాని అనుకున్న టైం లోనే రిలీజ్ చేద్దాం. షూటింగ్ ప్రారంభించండి అని అన్నాడట. ఆ భరోసాకు, ధైర్యనికి యూనిట్ సభ్యులు షాక్  కి గురయ్యారని చెప్పారు త్రివిక్రమ్. ఎన్టీఆర్ ఈ సినిమాకు బ్లడ్ అండ్ సోల్ పెట్టి పని చేసాడు అని త్రివిక్రమ్, ఎన్టీఆర్ ని పొగిడారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.