మరో ఘ‌న‌త సాధించ‌నున్న ఎన్టీఆర్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr ipl
Updated:  2018-03-27 03:58:50

మరో ఘ‌న‌త సాధించ‌నున్న ఎన్టీఆర్‌

జూనియ‌ర్ ఎన్టీఆర్  హీరోగా అరంగేట్రం చేసిన కొద్ది రోజుల‌కే బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టి చ‌రిత్ర సృష్టంచిన విష‌యం తెలిసిందే.....  ఎన్టీఆర్ న‌ట‌నుకు, డైలాగ్ డెలివ‌రీకు  ఫిదా అవ్వ‌ని వాళ్లుండ‌రు అంటే అతి శ‌యోక్తికాదు త‌న వాక్ చాతుర్యంతో  ఇత‌రుల‌ను ఆక‌ట్టుకుంటారు ఎన్టీఆర్ ... దీని వ‌ల్ల‌నే ఎన్టీఆర్‌ను మా. టీవీలో జ‌రిగే బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా మాటీవీ యాజామాన్యం ఎన్నుకుంది. 
 
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ మొద‌టి షో విజ‌య‌వంతమైంది. అయితే రెండో సీజన్‌కు కూడా ఎన్టీఆర్‌నే వ్యాఖ్యాతగా కొన‌సాగించాల‌ని మా యాజ‌మాన్యం అనుకున్నా, ఎన్టీఆర్‌  వరుసగా త్రివిక్రమ్‌, రాజమౌళిలతో సినిమాలతో బిజీగా ఉండటంతో స్టార్ యాజమాన్యం మరో హీరో కోసం ప్రయత్నాలు చేస్తోంది... ఆ ప్లేస్ ను హీరో నాని భ‌ర్తీ చేస్తారు అని కూడా తెలుస్తోంది.
 
ఇక‌ మ‌రో బుల్లితెర పై  సందడి చేయ‌డానికి ఎన్టీఆర్ సిద్దం అవుతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2018 సిరీస్‌ తెలుగు ప్రసారాలకు ఎన్టీఆర్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించనున్నారు. తెలుగులో స్టార్‌ మా ప్రసారం చేయనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషన్‌ బాధ్యతలను ఎన్టీఆర్‌ తీసుకోవటంతో తెలుగు ప్రసారాలకు మరింత క్రేజ్‌ వస్తుందని భావిస్తున్నారు...గ‌తంలో బిగ్‌బాస్ షోను విజ‌య‌వంతంగా న‌డిపిన‌టువంటి ఘ‌న‌త జూనియ‌ర్ ఎన్టీఆర్ ఉన్న విష‌యం అంద‌రికి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.