కొడుకు చేతిలో దెబ్బలు తింటున్న ఎన్టీఆర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr
Updated:  2018-08-27 05:28:03

కొడుకు చేతిలో దెబ్బలు తింటున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇటివలే కొడుకు పుట్టిన విషయం మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఎన్ని షూటింగ్స్ తో బిజీ గా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ కి ఎన్టీఆర్ పంచింగ్ బ్యాగ్ లా తయారయ్యాడు అంట.
 
ఈ విషయాన్నీ స్వయాన ఎన్టీఆర్ ఏ తన ఇన్‌స్టాగ్రాంమ్‌లో ఒక వీడియో పెట్టి చెప్పాడు. ఈ వీడియో లో జూనియర్ ఎన్టీఆర్ ని టేబుల్ పై కూర్చుకున్న అభయ్ రామ్ పంచింగ్ బ్యాగ్ ని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. "నా కొడుక్కి నేను పంచింగ్ బ్యాగ్ లా తయారు అయ్యాను" అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియా లో తెగ హలచల్ చేస్తుంది.
 
ఈ వీడియో ని చూసిన ఫ్యాన్స్ అందరూ సినిమాల్లో ఎన్టీఆర్ విలన్ ని కొడుతుంటే రియల్ లైఫ్ లో మాత్రం కొడుకు ఎన్టీఆర్ ని కొడుతున్నాడు అంటూ మురిసిపోతున్నారు. ప్రస్తుతం "అరవింద సమేత" షూట్ బ్రేక్ లో ఉన్న ఎన్టీఆర్ ఇలా ఫ్యామిలీ తో సరదాగా గడిపేస్తున్నాడు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.