రాతను ఎవరు మార్చలేరు.. జూ.ఎన్టీఆర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr
Updated:  2018-10-08 12:36:23

రాతను ఎవరు మార్చలేరు.. జూ.ఎన్టీఆర్

ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. దసరా కానుకగా ఈ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.. ఈ సందర్భంగా మీడియాలో ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు తారక్.. ఒక మీడియా కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఇలా వరుసగా తమ ఫ్యామిలీ మెంబర్స్ కు యాక్సిడెంట్ లు అవ్వడంపై స్పందించాడు..
 
ఈమద్య కాలంలో ఆ ఫ్యామిలీలో ఇద్దరు యాక్సిడెంట్స్ కారణంగా మృతి చెందగా - ఎన్టీఆర్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలయిన విషయం తెల్సిందే. నందమూరి ఫ్యామిలీకి వాహన గండం ఉందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ పెద్ద అన్న జానకి రామ్ హైదరాబాద్ - విజయవాడ హైవేపై యాక్సిడెంట్ లో చనిపోయారు..
 
అంతకు ముందు ఎన్నికల ప్రచారం చేసి వస్తుండగా జూ.ఎన్టీఆర్ కూడా యాక్సిడెంట్ కు గురయ్యాడు. అయితే అదృష్టం బాగుండటంతో ఎన్టీఆర్ గాయాలతో బయటపడ్డారు... ఇక హరికృష్ణ ఇటీవల అభిమాని ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ లో మృతి చెందిన విషయం తెల్సిందే. దీని పై స్పందిస్తూ,ఈ యాక్సిడెంట్స్ ను నందమూరి ఫ్యామిలీకి శాపంగా అభిమానులు ఆందోళన చెందుతున్న విషయమై ఎన్టీఆర్ ను ప్రశ్నించిన సమయంలో.. ఈ యాక్సిడెంట్ లను ఆ కోణంలో అస్సలు చూడవద్దని - ఇలాంటి సంఘటనలను విశ్లేషించుకోకుండా ఉండటం బెటర్ అన్నాడు.
 
మా కుటుంబానికే ఎందుకు ఇలా జరుగుతుందో అనే బాధ మొదట వేసిందని - కాని రాతను ఎవరు మార్చలేరని - అంతా కూడా నిమిత్త మాత్రులం కనుక జరిగినదాన్ని సర్దుకుని వెళ్లడమే మనం చేయగలమని - ఎక్కువ ఆలోచించి మన జీవితంలో ముందుకు వెళ్లకుండా ఉండలేమని అన్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.