మొదటి సారి కళ్యాణ్ రామ్ తల్లి గురించి మాట్లాడిన ఎన్టీఆర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr
Updated:  2018-10-09 12:25:30

మొదటి సారి కళ్యాణ్ రామ్ తల్లి గురించి మాట్లాడిన ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు సొంత అన్నదమ్ములు కాదు అనే విషయం తెలిసిందే. తండ్రి ఒకరే కానీ, తల్లులు మాత్రం వేరు. కొన్నేళ్ల ముందు వరకు ఒకరి గురించి ఒకరు మాట్లాడేవాళ్లు కూడా కాదు కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు కొంత మారాయి. ఇద్దరూ బాగానే దగ్గరయ్యారు. ఇద్దరూ కలిసి జై లవకుశ సినిమా కూడా తీశారు. సినిమా కూడా హిట్ అయింది.

తండ్రి మరణం తరువాత కూడా ఒకరికి ఒకరు అండగా ఉంటున్నారు. అయితే అరవింద సమేత ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన తారక్, కళ్యాణ్ రామ్ తల్లి ప్రస్తావన తీసుకురావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెను పెద్దమ్మ అని సంబోధిస్తూ మాట్లాడాడు తారక్. హరి కృష్ణ మరణం తరువాత ఆ విషాదం నుంచి తాను, కళ్యాణ్ రామ్ అన్నయ్య బయటికి రాలేకపోతున్నామని, తమ కంటే కూడా తమ తల్లుల బాధ ఇంకా పెద్దదని తారక్ అన్నాడు.

తన తల్లితో పాటు పెద్దమ్మ కూడా తీవ్ర మనో వేదనకు గురయ్యారు అని తారక్ చెప్పాడు. ఇక తన తల్లి బలం తన కొడుకులే అని, తన తండ్రి తాలూకు విషాదానికి పిల్లల నవ్వుల్లో మరిచిపోతున్నారు అని ఎన్టీఆర్ చెప్పాడు. అలాగే హరికృష్ణ పరిపూర్ణమైన జీవితం గడిపి వెళ్లిపోయారని, తండ్రిగా అన్ని బాధ్యతలూ నిర్వర్తించారని చెప్పిన తారక్ తాను కూడా అలాగే పరిపూర్ణంగా జీవించతామే లక్ష్యంగా పెట్టుకున్నానని, తన పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.