ఆ రోజు వచ్చిన ఫోన్ కాల్ తో చాలా భయపడ్డాను

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr
Updated:  2018-07-14 04:17:48

ఆ రోజు వచ్చిన ఫోన్ కాల్ తో చాలా భయపడ్డాను

జూనియర్ ఎన్టీఆర్ ఇటివలే సెలెక్ట్ అనే ఒక ఫోన్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యాడు. అయితే ఈ సంధర్బంగా ఆ కంపెనీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ని అరేంజ్ చేసారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తను ఎక్కువ భయపడిన ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ "రభస" షూటింగ్ కోసం ఫారిన్ లో ఉన్నప్పుడు తన భార్య గర్భవతిగా ఉంది అంట. ఆ టైం లో డెలివరీ డేట్ లేదు అని తెలిసే షూటింగ్ షెడ్యూల్ పెట్టుకున్నాడు ఎన్టీఆర్. డాక్టర్స్ కూడా డెలివరీ డేట్ ఇప్పట్లో అయితే ఉండదు అని తేల్చి చెప్పేశారు అట. కాని ఎన్టీఆర్ షూటింగ్ లో నుంచి లక్ష్మి ప్రణతి కి కాల్ చేసినప్పుడు ఏదో తేడాగా అనిపించింది అట. నేను రాకుండా బాబుని కంటే చంపేస్తాను అని కడు వార్నింగ్ ఇచ్చాడు అట.

ఇక చేసేది లేక వెంటనే హైదరాబాద్ ఫ్లైట్ పట్టుకొని హైదరబాద్ కి రీచ్ అయ్యే సరికి ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి డైరెక్ట్ హాస్పిటల్ కి రమ్మని చెప్పింది అంట. అలా కాల్ రాగానే చాల భయపడుకుంటూ ఎన్టీఆర్ హాస్పిటల్ కి వెళ్ళాడు అంట అప్పుడే తన మొదటి కొడుకు అయిన అభయ్ రామ్ కి జన్మనిచ్చింది అంట ప్రణతి. ఎన్టీఆర్ ఈ ఇన్సిడెంట్ ని ప్రెస్ మీట్ లో తలుచుకొని అందరితో పంచుకున్నాడు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.