ఆయన చాలా చూసి ఈ స్టేజి కి వచ్చిన మనిషి.. జూ.ఎన్టీఆర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr.ntr
Updated:  2018-10-06 06:07:26

ఆయన చాలా చూసి ఈ స్టేజి కి వచ్చిన మనిషి.. జూ.ఎన్టీఆర్

త్రివిక్రమ్ అగ్రస్థాయి లో ఉన్న ఏ నటుడు అయినా ఈయన దర్శకత్వంలో చేయాలనుకుంటారు.. కానీ ఈ మధ్య త్రివిక్రమ్ పరిస్థితి ఏమి బాలేదు.. ఒకే ఒక్క సినిమాతో ఈ మాటల మాంత్రికుడు ఇమేజ్ కి ఇబ్బంది ఏర్పడింది.. త్రివిక్రమ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ వచ్చిన "అజ్ఞతవాసి" సినిమా రిజల్ట్ అందరికి తెలిసిందే.

అయితే ఆ ప్రభావం ఇప్పుడు తరువాతి సినిమా మీద పడనుందా అన్న భయం అప్పట్లో కలిగింది.. ఎందుకంటే అజ్ఞతవాసి రిలీజ్ కాకుండానే.. జూ.ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయ్యాడు త్రివిక్రమ్.. ఇదే విషయం ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆందోళన కలుగచేస్తుంది.. ఈ సినిమా మరి కొద్దిరోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక మీడియా కి.. అయితే అక్కడ అజ్ఞతవాసి సినిమా ప్లాప్ కోసం ప్రస్తావన రాగా, ఎన్టీఆర్ ఇలా స్పందించారు..అర‌వింద స‌మేత‌ అనే పూర్తిగా త్రివిక్ర‌మ్ సినిమా.సినిమాల‌నేవి ఓ ప్ర‌యాణం. అందులో హిట్స్ ఉండొచ్చు, ఫ్లాప్స్ ఉండొచ్చు. నాకు లేవా ఫ్లాపులు..? ఒత్తిడి అనేది త్రివిక్ర‌మ్‌గారిపైనే కాదు.. అంద‌రిపైనా ఉంటుంది... 

కేవలం ఒక్క ప్లాప్ త్రివిక్రమ్ మైండ్ ని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను.. అతని జీవితం లో చాలా స్టేజులు చూసొచ్చిన మనిషి, ఆయ‌న ప్ర‌యాణంలో నేను భాగ‌మ‌య్యానంతే. అంతేగానీ నా ప్ర‌యాణంలో త్రివిక్ర‌మ్ భాగం కాదు. అర‌వింద‌ సమేతలో అన్ని పాత్ర‌ల్నీ చాలా అద్భుతంగా రాశారాయ‌న‌, ఇది పూర్తి త్రివిక్రమ్ సినిమా ..అంటూ గట్టి జవాబు ఇచ్చాడు ఎన్టీఆర్‌.. మరి ఎన్టీఆర్ నమ్మకం నిజమవుతుందా లేదా అనేది సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.