సీనియర్ హీరోకి షాకిచ్చిన కాజల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-02 01:39:23

సీనియర్ హీరోకి షాకిచ్చిన కాజల్

సీనియర్ హీరో అయిన రాజశేఖర్ గత ఏడాది "గరుడవేగా" అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా తరువాత రాజశేఖర్ ఇంకా ఏ సినిమా ని ఓకే చెయ్యలేదు. కానీ రాజశేఖర్ మాత్రం "అ" ఫేం అయిన ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి మాత్రం ఒకే చెప్పాడు అని తెలుస్తుంది. 
 
ఈ సినిమాలో రాజశేఖర్ సరసన నటించడానికి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా అనుకున్నాడు ప్రశాంత్ వర్మ, కాని కాజల్ అగర్వాల్ మాత్రం రాజశేఖర్ సరసన నటించడానికి నో చెప్పినట్టు తెలుస్తుంది. కేవలం ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్లే కాజల్ అగర్వాల్ ఈ సినిమాకి నో చెప్పిందని తెలుస్తుంది. 
 
ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హిందీ "క్వీన్" ని తమిళ్ లోకి రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పూర్తీ కాగనే రాజశేఖర్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు ప్రశాంత్ వర్మ. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకేక్కబోతుంది. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.