యాక్టర్ నుంచి డాక్టర్ అయిన కాజల్ అగర్వాల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kajal agharwal
Updated:  2018-08-16 01:29:55

యాక్టర్ నుంచి డాక్టర్ అయిన కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం శర్వానంద్ సరసన ఒక సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. "స్వామి రా రా" ఫేం అయిన సుధీర్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో కాజల్ అగర్వాల్ పాల్గొనబోతుంది. ఈ సినిమా లో కాజల్ ఎప్పుడు కనిపించని డాక్టర్ పాత్రలో కనిపించబోతుంది అంట.
 
ఈ చిత్ర యూనిట్ చిత్ర షూటింగ్ ని ఈ సంవత్సరం ఆఖరికి పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేసారు. "కేశవ" సినిమా ఫ్లాప్ అయిన తరువాత ఈ సినిమా ని సుధీర్ వర్మ గ్యాంగ్ స్టార్స్ డ్రామా గా రూపొందిస్తున్నారు. శర్వానంద్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.
 
ఇదిలా ఉంటే శర్వానంద్ సాయి పల్లవితో జత కట్టి "పడి పడి లేచే మనసు" అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది అనే వార్త ఫిలిం నగర్ లో చకర్లు కొడుతుంది. ఈ సినిమాని హను రాఘవాపుడి డైరెక్ట్ చేస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.