గోపిచంద్ సినిమాకి కాజల్ ఓకే చెప్తుందా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kajal and gopi chand
Updated:  2018-07-28 03:09:57

గోపిచంద్ సినిమాకి కాజల్ ఓకే చెప్తుందా ?

స్టార్ హీరోయిన్ అయిన కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన రెండు సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమా తరువాత కాజల్ అగర్వాల్ ఇంకా ఏ తెలుగు సినిమాని ఒప్పుకోలేదు. కానీ కాజల్ మాత్రం తన తదుపరి సినిమాని గోపిచంద్ తో కలిసి నటించబోతుంది అనే టాక్ ఫిల్మ్ నగర్ లో ఉంది.

ఇదిలా ఉంటే అసలు కాజల్ అగర్వాల్ ఎప్పుడో "మొగుడు" అనే సినిమాలో గోపిచంద్ సరసన నటించాలి కానీ అప్పుడు ఎందుకో ఆ సినిమాకి నో చెప్పింది కాజల్. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఓకే చెప్తుందా లేకపోతే మళ్ళీ రిజెక్ట్ చేస్తుందా చూడాలి.

ఈ సినిమా ద్వారా సాయి అనే కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు గోపిచంద్. గోపిచంద్ తో ఇది వరకు "సాహసం" అనే సినిమాని ప్రొడ్యూస్ చేసిన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఇటీవలే "పంతం" తో ప్లాప్ ని అందుకున్న గోపిచంద్ ఈ సినిమాతో అయిన హిట్టు కొడతాడో లేదో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.