విలన్ వేషాలు వేస్తున్న కాజల్ అగర్వాల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine kajal
Updated:  2018-07-05 18:17:30

విలన్ వేషాలు వేస్తున్న కాజల్ అగర్వాల్

టాలీవుడ్, కోలీవుడ్ లో గత పదేళ్ళ నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. ఇన్నేళ్ళలో కాజల్ అగర్వాల్ ఎంతోమంది స్టార్ హీరోస్ పక్కన హీరోయిన్ గా నటించింది, కాని కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించలేదు కాజల్.
 
అయితే కెరీర్ లో ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతుంది అట కాజల్.కొత్త దర్శకుడు అయిన భార్గవ్ భారీ బడ్జెట్ తో ఫుల్ సోషియో ఫాంటసీ సినిమా ని ఒకటి రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా లో కాజల్ రావణుడి సోదరి సూర్పణక పాత్రలో కనిపించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. 
 
ఈ సినిమాకి కూడా సూర్పణక అనే టైటిల్ ని అనుకుంటున్నారు అని టాక్. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొంబోతుంది అంట. ఇదిలా ఉంటే తమిళ్ లో ఇది వరకు శృతి హాసన్ మెయిన్ లీడ్ గా సంఘమిత్ర అనే సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. మరి ఈ సినిమా కూడా సంఘమిత్ర లాగ కాకుండా త్వరలో సెట్స్ పైకి వెళ్లాల‌ని అని మూవీ యూనిట్ భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.