నాలో అవి చూసే నాకు ఇంకా అవకాశాలు ఇస్తున్నారు - కాజల్ అగర్వాల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kajal heroine
Updated:  2018-09-01 01:00:07

నాలో అవి చూసే నాకు ఇంకా అవకాశాలు ఇస్తున్నారు - కాజల్ అగర్వాల్

"లక్ష్మి కళ్యాణం" అనే సినిమాతో హీరోయిన్ గా మారి "మగధీర" అనే సినిమాతో తోలి బ్లాక్ బస్టర్ ని అందుకుంది కాజల్ అగర్వాల్. ఇక అప్పటి నుంచి దాదాపు పదేళ్ళ పాటు కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది...కొనసాగుతూనే ఉంది.

అయితే తనకి ఇప్పటికి అవకాశాలు ఎలా వస్తున్నాయి అసలు ఎందుకు వస్తున్నాయి అనే దానిపై ఒక క్లారిటీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ దీని గురించి మాట్లాడుతూ, ఇండస్ట్రీ లో అందం ఇంకా హాట్ సీన్స్ లో నటించడం వల్లో అవకాశాలు రావు. నాకైతే ఆ రకంగా అవకాశాలు ఎప్పుడు రాలేదు.

ఎందుకంటే ఒక నిర్మాత లేదా దర్శకుడు నా దగ్గరకి వచ్చినప్పుడు నా అందం కంటే కూడా నా నిజాయితీ ఇంకా క్రమశిక్షణ చూస్తారు అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. అందం అనేది సినిమా పరిశ్రమలో ఒక అంశం మాత్రమే. మిగిలినవన్నీ కావాలి కదా. అది లేకపోతే ఎలా అంటోంది కాజల్ అగర్వాల్. అయితే ఇండస్ట్రీ లో మాత్రం హీరోయిన్ కావలి అంటే అందమే ముఖ్యం కానీ కాజల్ అగర్వాల్ ఎందుకు ఇలా మాట్లాడిందో ఎవరికీ అర్ధం కావట్లేదు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.