ఆ కోరిక అలానే ఉంది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-19 12:24:50

ఆ కోరిక అలానే ఉంది

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి ల‌క్ష్మీ క‌ళ్యాణం చిత్రం ద్వారా అడుగు పెట్టారు కాజ‌ల్ అగ‌ర్వాల్... ఆ త‌ర్వాత చంద‌మామ, డార్లిండ్  జ‌క్క‌న్న తెర‌కెక్కించిన మ‌గ‌ధీర వంటి చిత్రాల‌లో న‌టించి మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది కాజ‌ల్..  ఆమె పుట్టింది మ‌హారాష్ట్ర... అయినా అక్క‌డి ప‌రిచ‌యాల‌ కంటే ఇక్క‌డే ఎక్కువ‌ ప‌రిచ‌యాలు  ఉన్నాయి ఈ బ్యూటీకి... ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లోనే కాకుండా త‌మిళ్, హిందీ, వంటి ప‌లు భాషా  చిత్రాల‌లో న‌టిస్తున్నారు.
 
తాజాగా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ నిర్వ హించిన ఇంట‌ర్వ్యులో త‌న వ్య‌క్తిగ‌త న‌ట‌న గురించి తెలిపింది కాజ‌ల్... తాను ఎన్ని సినిమాల‌లో న‌టించినా, ఎన్ని పాత్రలు పోషించినా త‌న చిర‌కాల కోరిక అలాగే మిగిలి పోయింద‌ని అంటోంది ఈ క్వీన్... తాను న‌టించిన చిత్రాల‌లో ఎక్కువ శాతం ల‌వ్, ఫ్యామిలీకి సంబంధించిన‌వే అని తెలిపింది కాజ‌ల్.
 
ఎప్పుడైతే త‌న చిన్న‌నాటి కోరిక ప్ర‌కారం పూర్తి స్థాయి సినిమాలో యాక్ష‌న్ పాత్ర చేస్తానో అప్పుడే త‌న కోరిక నెర‌వేరుతుంద‌ని త‌న కోరిక బ‌య‌ట‌పెట్టింది కాజ‌ల్... అలాంటి క‌థ ఎవ‌రైనా త‌న‌కు వినిపిస్తే వెంట‌నే ఆ క‌థ‌కు ఒకే చేస్తాన‌ని అంటోంది ఈ అందాల భామ‌ ... ఇందులో ఫైట్లు కూడా ఉండాల‌ట, ఆ ఫైటింగుల‌ను తానే చేయాల‌ట‌... అయితే ఈ అవ‌కాశం ఇంత‌వ‌ర‌కు రాలేదు, వ‌స్తే మాత్రం త‌ప్ప‌కుండా త‌న స‌త్తా ఏంటో చూపిస్తాన‌ని చెబుతోంది కాజ‌ల్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.